‘మను చరిత్ర’ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల

‘మను చరిత్ర’ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదల

యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నూతన దర్శకుడు భరత్ పెదగాని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర ‘విడుదలకు సిద్ధమవుతోంది.ప్రొద్దుటూర్ టాకీస్ బ్యానర్ లో ఎన్ శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశారు. ట్రైలర్‌ ని బట్టి చూస్తే.. మను చరిత్ర ఒక ఇంటెన్స్ ప్రేమకథ. శివ ఒక ఇంటెన్సివ్ పాత్రను పోషిస్తాడు. అతనికి వివిధ వయసులలో విభిన్న ప్రేమ కథలు ఉన్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల అమ్మాయిలందరితో విడిపోతాడు. తనను అంతమొందించాలని అవకాశం కోసం చూస్తున్న కొంతమందితో అతనికి శత్రుత్వం ఉంది. శివ కందుకూరి తన పాత్రలో అద్భుతంగా నటించాడు. చాలా వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ప్రతి ప్రేమ కథలోనూ…