తెలుగు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో ఇటీవల చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన “బలగం” చిత్ర యూనిట్ ను ఉగాది నంది సత్కారం తో సత్కరించారు. బలగం చిత్ర నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హర్షిత, దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ మరియు ఇతర నటీ నటులు సాంకేతిక నిపుణులను ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆర్ నారాయణ మూర్తి, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు నంది పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఎల్ వీ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో జరిగిన ఈ వేడుకలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటులు కాదంబరి కిరణ్, రామ్ రావిపల్లి, రవికాంత్, నిర్మాతలు కూనిరెడ్డి శ్రీనివాస్, మోహన్ గౌడ్, గల్ఫ్ వాసు, అని…