తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన బలగం సినిమా చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఎఫ్డీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బలగం సినిమా బృందానికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం చిత్రంలోని నటీనటులు, యూనిట్ సభ్యులను, దర్శక నిర్మాతలను శాలువాతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, అనుబంధాలను చక్కగా చూపించారని, తెలుగు సినీరంగానికి కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌ను ప్రారంభించిన నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలను అభినందించారు. బలగం సినిమాను చూసిన ప్రతిఒక్కరు తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్నారని,…