‘ఖుషి’ రి-రిలీజ్ అభిమానులకు ఐకాన్ చిత్రాన్ని మళ్లీ సెలెబ్రేట్ చేసుకునే అవకాశం: నిర్మాత ఎ.ఎం. రత్నం

'ఖుషి' రి-రిలీజ్ అభిమానులకు ఐకాన్ చిత్రాన్ని మళ్లీ సెలెబ్రేట్ చేసుకునే అవకాశం: నిర్మాత ఎ.ఎం. రత్నం

*లైలా-మజ్ను, రోమియో-జూలియట్ తరహాలో గుర్తుండిపోయే ప్రేమకథ ‘ఖుషి’ అని నిర్మాత తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన చిత్రం ‘ఖుషి’. పవన్ కళ్యాణ్, భూమిక చావ్లా జంటగా నటించిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా భారీగా రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రానికి.. మణిశర్మ సంగీతం అందించగా, పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. విడుదల సమయంలో ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన పవన్ కళ్యాణ్ చిత్రాలలో ఒకటైన ఖుషి.. రెండు దశాబ్దాల తర్వాత కూడా అదే కొత్త అనుభూతినిస్తోంది. రీ-రిలీజ్ కోసం విడుదల చేసిన ఖుషి ప్రత్యేక ట్రైలర్ అభిమానులను…