ప్రజా గాయకుడు గద్దర్ (74) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ర్టా హాస్పిటల్‌లో చేరిన గద్దర్ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ నెల 3న ఆయనకు బైపాస్ సర్జరీ చేయగా కోలుకున్నారు. అయితే, ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో బాధపడుతుండడంతో ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ‘అమ్మ తెలంగాణమా’, ‘పొడుస్తున్న పొద్దుమీద’ వంటి పాటలు ఉద్యమాలకు మరింత ఊపుతెచ్చాయి. ‘మా భూమి’ సినిమాలో ‘బండి వెనక బండికట్టి’ పాటతో వెండితెరపై కనిపించారు. సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రమిడి.విశాఖ స్టీల్…