‘టైగర్ నాగేశ్వరరావు’ మా డ్రీమ్ ప్రాజెక్ట్ : నిర్మాత అభిషేక్ అగర్వాల్‌

'Tiger Nageswara Rao' is our dream project : Producer Abhishek Aggarwal

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్, మ్యాసివ్ ట్రైలర్, చార్ట్‌బస్టర్ పాటలతో టైగర్ ఇప్పటికే నేషనల్ వైడ్ గా హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ మీడియాతో ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ని దేశవ్యాప్తంగా చూపించాలని అనుకోవడానికి కారణం? – బయోపిక్స్ జనరల్ గా నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులపై చేస్తారు. అయితే ఒక దొంగకి బయోపిక్ ఎందుకు…