యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇదివరకే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఈరోజు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు. అయితే, అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులే. పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి అన్ని వర్గాల…