‘సోల్ ఆఫ్ స‌త్య’ టీజర్‌ విడుద‌ల

'Soul of Satya' teaser released

సుప్రీమ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ స్పెష‌ల్ వీడియోను రూపొందించారు. దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన వీడియో అది. ఈ స్పెష‌ల్ వీడియో నుంచి ‘స‌త్య‌’ అనే పేరుతో ఓ టీజర్‌ను విడుద‌ల చేశారు. ఈ స్పెష‌ల్ వీడియోలో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో క‌లిసి స్వాతి న‌టించింది. ఈ గ్లింప్స్‌ను మేక‌ర్స్ ‘సోల్ ఆఫ్ స‌త్య’ అని పేర్కొన్నారు. వీడియో కూడా టైటిల్‌కు త‌గ్గట్టే ఉంది. గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి పెళ్లి చేసుకోవ‌టం ప్రేమ‌తో కౌగిలించుకునే స‌న్నివేశాల‌ను చూడొచ్చు. ఈ మ్యూజికల్ షార్ట్‌లోని పాట‌ను టాలెంటెడ్ సింగ‌ర్ శృతి రంజ‌ని కంపోజ్ చేసింది. స‌త్య అనే స్పెష‌ల్ వీడియోతో ఆమె మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తుంది. ఇందులో సాయిధ‌ర‌మ్ తేజ్ సైనికుడిగా క‌నిపిస్తారు.…