వాస్సీవాడి తస్సాదియ్యా అంటూ ఈ సంక్రాంతికి బోలెడంత సంబరాన్ని తీసుకొచ్చారు కింగ్ నాగార్జున. జీ తెలుగుతో కలిసి సంక్రాంతి సంబరాల్ని ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఈ ఎక్స్ క్లూజివ్ సంక్రాంతి సంబరాల్ని మీ జీ తెలుగులో జనవరి 14వ తేదీ, శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చూసి ఎంజాయ్ చేయండి. కేరళలో అట్టహాసంగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాల కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హీరోలు నాగార్జున, నాగచైతన్య, అందాల ముద్దుగుమ్మ కృతిషెట్టి కేరళ వెళ్లారు. జీ తెలుగు కుటుంబంతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఒకే వేదికపై అక్కినేని తండ్రికొడుకులు నాగార్జున, నాగచైతన్య అలా కలిసి నడిసొస్తుంటే.. వాసీవాడితస్సాదియ్యా.. ఇది కదా పండగ అనిపించింది. ఈ సంక్రాంతి కోసం చాలా సంబరాలు మోసుకొచ్చింది జీ తెలుగు. ప్రముఖ హాస్యనటుడు అలీ తో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.…