చూడాల్సిన సినిమా : సైయారా ఈ తరానికి ప్రేమలు తెలియవు. అందం ఆకర్షణ ప్రేమ అనుకునే తరం. సెంటిమెంట్ తెలియదు. ర్యాంకులు సాధించడం లేదా ఆవారా బ్యాచ్ లుగా ఎంజాయ్ చేయడం మాత్రమే తెలుసు. అందుకేనేమో,’ సైయారా’కు బాగా కనెక్ట్ అయ్యారు. వీరి వెనుక తరం నుంచి పెద్ద తరం వరకు ప్రేమ లోతు ఏంటో తెలుసు. ప్రేమ అనుభవం తెలుసు. అందుకే ఆ తరాలు కూడా ‘సైయారా’కు కనెక్ట్ అయ్యారు. ఈతరం తెలియక, ఆ తరాలు తెలిసి మొత్తానికి సినిమా హృదయాలను టచ్ చేసింది. ఎంతగా అంటే సినిమా చూస్తూ చూస్తూ ఏడ్చేంతగా… సినిమా పూర్తి అయ్యాక థియేటర్ సిబ్బంది వచ్చి సినిమా అయిపోయింది అని సాగనంపేంత వరకు ఆ సీట్లలో అలా వేదనతో కూర్చుండి పోయే అంతగా కనెక్ట్ అయిపోయారు. 40 కోట్ల బడ్జెట్…