సుప్రీమ్ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మంచి జోష్ లో ఉన్నాడు. ఆయనకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. చాలా కాలం తర్వాత అతనికి దక్కిన హిట్ ఇది. అతని కెరీర్ లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆ సినిమా తర్వాత వెంటనే తన మేనమామ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. ఈ చిత్రం కూడా మంచి టాక్ అందుకుంది. అయితే, ఈ జోష్ లో ఆయన మరిన్ని మంచి సినిమాలు తీస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఊహించని షాక్ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడట. ఆయన అలాంటి నిర్ణయం…