జపాన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సందడి!

RRR Team in Japan

ఎన్టీఆర్-రామ్ చరణ్ హీరోలుగా ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తెలుగు స్టామినాను మరోసారి ప్రపంచానికి వెలుగెత్తి చాటింది. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ జపాన్‌లో సందడి చేస్తోంది. శుక్రవారం (21 అక్టోబర్ 2022) ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేశారు. దీని కోసం ఎన్టీఆర్-రామ్ చరణ్, రాజమౌళి రెండు రోజుల క్రితమే జపాన్‌ చేరుకుని ప్రమోషన్‌ చేశారు. జపాన్‌ మొత్తం పర్యటించారు. ఈక్రమంలో రాజమౌళి జపనీస్‌ వీడియో గేమ్‌ డైరెక్టర్‌, క్రియేటర్‌ హిడియో కొజిమాను కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోను రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. ‘‘జపాన్‌లో ప్రముఖ వీడియో గేమ్‌ డైరెక్టర్‌ కొజిమాని కలవడం ఆనందంగానూ, గౌరవంగారూ ఉంది. గేమ్‌లు, సినిమాలతోపాటు ఎన్నో విషయాల గురించి ఆయనతో మాట్లాడాను. ఈ జ్ఞాపకాలను చిరకాలం గుర్తుంచుకుంటాను’’…