దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా… నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్’ పక్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ రౌడీ బాయ్స్ టైటిల్ ట్రాక్, ప్రేమే ఆకాశమైతే అనే పాటలు విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్లో సాగే సినిమా. ఇందులో లవ్ కంటెంట్ ఎలా ఉంటుందనేది సినిమా చూడాల్సిందే. యూత్‌ఫుల్ మూవీ కావడంతో దీనికి రౌడీ బాయ్స్ అనే…