రాంగోపాల్ వర్మ మూవీ ‘శారీ’ ఫాన్సీ రేట్ తో తెలుగు రాష్ట్రాలకు పంపిణీ హక్కులు పొందిన ప్రముఖ పంపిణీదారుడు ముత్యాల రాందాస్

Renowned distributor Mutyala Ramdas has got distribution rights for Telugu states with Ramgopal Varma's movie 'Shari' at a fancy rate.

రాంగోపాల్ వర్మ తాజా సినిమా ‘శారీ’ టైటిల్ కి ‘టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనే లాగ్ లైన్ తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో అర్జీవి ఆర్వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘శారీ’ని ప్రముఖ బిజినెస్ మాన్ రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో విడుదల చేయడానికి ప్రముఖ పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్నారు. పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా ‘శారీ’ చిత్రం రూపొందుతోంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి పిచ్చివాడై ఆమెతో ప్రేమలోపడి ఎంతో…