వివిధ పర్మిషన్లు రావాల్సి ఉన్నందున ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రం విడుదలలో జాప్యం జరుగుతోందని హీరో సూర్య తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఓ లెటర్ పోస్ట్ చేశారు. వాస్తవానికి ఆ చిత్రాన్ని అక్టోబర్ 30న విడుదల చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించారు. ‘ఆకాశం నీ హద్దురా’ (సూరారై పొట్రు) చిత్రం విడుదలలో జాప్యం జరగడానికి కారణాలను, తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను హృదయాన్ని స్పృశించేలా తన లెటర్‌లో ఆయన వెల్లడించారు. ఒక లెటర్ ద్వారా తన ఆలోచనలను పంచుకోవడం తన దినచర్య కాదనీ, కానీ ఇప్పుడు తన అభిమానుల ముందు ఓపెన్ హార్ట్‌తో, పారదర్శక మనసుతో నిలబడాల్సిన ఒక పరిస్థితి తలెత్తిందని ఆయన చెప్పారు. ఎందుకంటే తను ఇప్పుడున్న స్థాయికి రావడంలో అన్నివేళలా తనకు అండగా నిలిచిందని అభిమానులేనని సూర్య అన్నారు. ‘ఆకాశం…
Tag: release
రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ఓటీటీలోనే..
డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ప్రేక్షకులను మరింతగా ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమవుతోంది. రీసెంట్‌గా ఆహాలో విడుదలైన భానుమతి అండ్ రామకృష్ణ, జోహార్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన సంగతి తెలిసిందే. అదే కోవలో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటించిన రొమ్‌కామ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్, హెబ్బాపటేల్ హీరోయిన్స్‌గా నటించారు. కుమారి 21 ఎఫ్‌లో సూపర్బ్ కెమిస్ట్రీతో హిట్ పెయిర్‌గా నిలిచిన రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. అతి తక్కువ సమయంలోనే ఆహా ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా తెలుగు…