వాస్తవ ఘటనలతో ‘మహాలక్ష్మి బి.ఏ’

mahalakshmi ba movie 1st lyrical video update

టి.డబ్ల్యూ.ఎస్ టాకీస్ బ్యానర్ పై వస్తోన్న లవ్, డ్రామా చిత్రం మహాలక్ష్మి బి.ఏ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. ఈ చిత్ర మొదటి లిరికల్ వీడియో ‘ఇప్పుడిప్పుడే’ దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కాబోతోంది. రమ్య చిన్ని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని రాజేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. హర్ష ప్రవీణ్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రభాకర్ దండు సాహిత్యం అందించారు. నిర్మాత: రాజేష్ఎడిటర్: దీపక్పబ్లిసిటీ డిజైనర్: రామ్ కోతకొండకెమెరామెన్: లోకేష్లిరిక్స్: ప్రభాకర్ దండుదర్శకత్వం: రాజేష్