రామా నాయక్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియఫ్పిసి సెక్రటరి టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ…“మగాడి దాష్టీకానికి ఆడవారు ఎలా బలవుతున్నారో దండు పాళ్యం గత సిరీస్ లో చూపించారు. కానీ ఈ రియల్ దండుపాళ్యంలో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేసారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్ చూశాక ఒక కర్తవ్యం, ప్రతిఘటన, మౌనపోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి.…