విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. నూతన దర్శకుడు రాజ్ విరాట్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ్ కృష్ణ, డస్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్నారు. ముందుగా టైటిల్ ఆ తరువాత విడుదల చేసిన టీజర్‌తో అటు ఆడియెన్స్‌లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన అందుకున్నారు బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే నేడు బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఆడియో ఆల్బమ్ నుంచి రాయే నువ్వు రాయే అనే పాటను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో నందు ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ ఫ్యాన్‌గా…