‘ఆర్ఆర్ఆర్’ తరువాత రాజమౌళి, హీరో మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పట్నుంచో ఈ కాంబినేషన్లో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మహేష్ అభిమానులు. ఎట్టకేలకు వారి కోరిక త్వరలోనే తీరబోతుంది. ఈ ఇద్దరి కలయికలో రూపొందనున్న చిత్రం 2025, జనవరిలో సెట్స్ విూదకు వెళ్లనుంది. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో వున్నారు. మహేష్ కూడా రాజమౌళి చిత్రంలో కనిపించబోయే మేకోవర్ పనిలో వున్నాడు. ఈ చిత్రంలో ఈ సూపర్‌స్టార్ గుబురు గడ్డం, లాంగ్‌హెయిర్‌తో కనిపించబోతున్నాడు. ఇటీవల పలు వేడుకల్లో మహేష్ ఇదే లుక్‌లో విూడియాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిన మహేష్‌ను ఆలుక్లో చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాజమౌళి సినిమాలో తమ హీరో లుక్ అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే సాధారణంగా రాజమౌళి సినిమాల్లో…