రఫీ స్వీయ దర్శకత్వంలో ‘నెరవేరిన కల’

Rafi's self-directed 'Neraverina Kala'

రఫీ, కుసుమాంజలి, షఫీ, నాగినీడు, సుజాత రెడ్డి, వైభవ్, టి.ఎస్.రాజు ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం ‘నెరవేరిన కల’. జాస్మిన్ ఆర్ట్స్ బ్యానర్ పై సయ్యద్ రఫీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకొని సెన్సార్ లో ఉంది. ఈ సందర్బంగా దర్శకుడు సయ్యద్ రఫీ చిత్ర విశేషాలను వివరిస్తూ.. ”తెలంగాణ ప్రాంతంలోని మారుమూల పల్లెల్లో మూడు తరాలనుండి ఎన్నో పోరాటాలు, బలిదానాలు చేసినా నెరవేరని కల ఇప్పుడు ఎలా నెరవేరిందో కళ్లకు కట్టినట్టు చూపే ఇతివృత్తమే ఈ చిత్ర కథాంశం. తరతరాల ఫ్యూడలిజం అంతమొందించే క్రమంలో జరిగిన పరిణామాలు ఎలాంటివి.. వాటిని ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు అనే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని..ఆలోచింపజేస్తాయి. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. ఓ పత్రికలో…