వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్ హీరోగా బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై కొత్త చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంఛ‌నంగా ప్రారంభం

By 7 PM Productions, Puppet Show Productions project with Thiruveer 'The Great Pre Wedding Show' launched traditionally by Rana Daggubati

వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ క‌థానాయ‌కుడిగా కొత్త సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హైదరాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. బై 7పి.ఎంప్రొడ‌క్ష‌న్స్, ప‌ప్పెట్ షో ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై రాహుల్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. క‌మిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య క‌థానాయిక‌. ముహూర్తం స‌న్నివేశానికి రానా ద‌గ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగ‌రం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు సందీప్ అగ‌రం, అష్మితా రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాను స‌పోర్ట్ చేయ‌టానికి ఇక్క‌డ‌కు వ‌చ్చిన రానాగారికి, ఇత‌ర సినీ పెద్ద‌లు, ప్ర‌ముఖులకు మ‌న‌స్ఫూర్తిగా ధ‌న్య‌వాదాల‌ను తెలియ‌జేస్తున్నాను. కామెడీ డ్రామా జోన‌ర్‌లో సినిమాను…