అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై గతంలో హృదయకాలేయం, కొబ్బరిమట్ట వంటి కమర్షియల్ హిట్స్ నిర్మించిన ప్రముఖ నిర్మాత సాయి రాజేశ్‌తో స్పెషల్ చిట్ చాట్ కలర్ ఫొటో సినిమా ఎలా మొదలైంది? కలర్ ఫొటో కథ నా సొంత అనుభవాలు నుంచి నేను తయారు చేసుకున్న కథ. ఈ సినిమా దర్శకుడు సందీప్ నాకు ఎప్పటినుంచో స్నేహితుడు, ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో మనోడుకి డైరెక్షన్ ఛాన్స్ ఇప్పిద్దామని చాలా ట్రై చేశాను, అయితే కొన్ని అనివార్య కారాణాలు వల్ల ఆ ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. దీంతో సందీప్ కి నేను రాసుకున్న కథ ఇచ్చి, నేనే నిర్మాతగా మారి కలర్ ఫొటో చిత్రాన్ని తీశాను, అలానే ఈ చిత్ర నిర్మాణంలో నా స్నేహితుడు బెన్నీ సహకారం మరువలేనిది. రంగు వివక్ష గురించి ఈ…