కృష్ణసాయి – మీనాక్షి జైస్వాల్ జంటగా నటిస్తున్న సినిమా ‘జ్యువెల్ థీఫ్’ .శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై, పీఎస్ నారాయణ దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సాయితో పాటు సీనియర్ నటీనటులు.. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి తదితరులు నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను 30 ఇయర్స్ పృధ్వీ విడుదల చేశారు. ఈ సందర్భంగా .. 30 ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ… హీరోగా కృష్ణసాయి ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో యాక్షన్ పార్టులు బాగా చేసాడు. ఆయన యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ మూవీలో నా రోల్ కూడా బాగుంది. సినిమా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. నేను, కృష్ణసాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. సమాజం కోసం…