డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఎమోషన్స్‌తో క్యూరియాసిటీ పెంచుతోన్న మూవీ ముఖ పరిచయం లేని అబ్బాయి, అమ్మాయి ఓ షాపింగ్ మాల్‌లోకి ఎంటర్ అవుతారు. అక్కడ షాపింగ్ పూర్తి చేసుకుంటారు. లిఫ్ట్ ఎక్కుతారు. ఎక్కగానే ఆ అమ్మాయి తాను లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లిపోవాలనుకుంటుంది. ఆ అబ్బాయి తనని లాగి పెట్టి ఒకటి కొడతాడు.అడిగితే ప్రాంక్ చేశానంటాడు . అలాంటి ఈజీ గోయింగ్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయి.. తనొక మ్యూజిషియన్.. ఇక అమ్మాయి విషయానికి వస్తే తనొక పెద్ద అందగత్తెననే అనే కాన్ఫిడెన్స్‌తో ఉంటుంది. ఇలాంటి భిన్నమైన మనస్తత్వాలున్న వీరిద్దరు అనుకోకుండా… షాపింగ్ మాల్‌లోని లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే ‘పాప్ కార్న్’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు దర్శక నిర్మాతలు. అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’.…