అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ ‘””పోలీస్ వారి హెచ్చరిక “” !. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న అనగా శనివారం నాడు ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అతిధుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో తనికెళ్ళ భరణి గారు మాట్లాడుతూ.. “నేను గతంలో బాబ్జీ తో కలిసి పని చేశాను. కానీ ఈ చిత్రంలో ఔట్ డోర్ లో ఉండటం వల్ల చేయలేకపోయాను. కానీ బాబ్జీ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి వచ్చాను. ఈ సినిమా కంటెంట్ గురించి విన్నాను. ఆ కంటెంట్ విన్నాక ఈ సినిమాని కచ్చితంగా సపోర్ట్ చెయ్యాలి అనిపించింది. అంత బాగుంది. ఈ సినిమా కంటెంట్ పై…