సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ‘పోలీస్ వారి హెచ్చరిక’ట్రైలర్ విడుదల

'Police Warn' trailer released in the presence of film celebrities

అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన “పోలీస్ వారి హెచ్చరిక” ట్రైలర్ ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. మనమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జి మీద ఉన్న గౌరవం. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఆర్మీ నుండి వచ్చిన నిర్మాత జనార్ధన్ గారితో కలిసి క్రమశిక్షణతో ఈ సినిమాను చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు. నటి…