ఓటిటిలోకి వచ్చిన ‘పరేషాన్‌’!

'Pareshan' in OTT!

నాటకరంగ అనుభవంతో వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నాడు తెలంగాణ నటుడు తిరువీర్‌ ఈ యువకుడు ’జార్జ్‌ రెడ్డి’, ’పలాస’, ’మల్లేశం’ తదితర చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. ఇటీవలే మసూద సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్టందుకున్నాడు. తాజాగా ఈ యంగ్‌ హీరో నటించిన చిత్రం ’పరేషాన్‌’. రూపక్‌ రొనాల్డ్‌ సన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా దగ్గుబాటి హీరో రానా సమర్పకుడిగా వ్యవహరించారు. తెలంగాణలోని ఓ గ్రామంలో స్నేహితుల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఫన్‌ ఎంటర్‌ టైనర్‌గా ఆలరించి మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రం తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫాం సోనీలివ్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా నేటి నుంచి ఈ సినిమా…