మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ సింగిల్ వందేమాతరం అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంది. మ్యూజికల్ జర్నీని ప్రారంభించడానికి ఇది సరైన పాటగా నిలిచింది. జాతీయ అంశాలు, ఇంటెన్స్ యాక్షన్‌తో పాటు, సినిమాలో మెస్మరైజింగ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సినిమా రొమాంటిక్ లేయర్‌ని చూపించడానికి, మేకర్స్ రెండవ సింగిల్-గగనాల ను గ్రాండ్ గా లాంచ్ చేశారు, ఫస్ట్ సింగిల్ కంపోజిషన్‌తో అందరినీ ఆకట్టుకున్న మిక్కీ జె మేయర్, గగనాల పాట కోసం ఒక ఆకర్షణీయమైన రొమాంటిక్ మెలోడీని అందించాడు. లీడ్ పైర్ వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న లవ్ బర్డ్స్ గా మెస్మరైజింగ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా, అర్మాన్ మాలిక్…