‘హిట్‌-3’లో నాని నట విశ్వరూపం.. చీకటి కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం!

Nani's acting in 'Hit-3' is an attempt to reveal the dark side!

తెలుగు ప్రేక్షకులకు ఫ్రాంఛైజీ రుచిని ’హిట్‌’ సినిమాలు బలంగా చూపించాయి. నాని కీలక పాత్రలో ’హిట్‌: ది థర్డ్‌ కేస్‌’తో మూడో చిత్రం విడుదలయ్యింది. ప్రచార చిత్రాలు, ఫ్రాంఛైజీపై ఉన్న నమ్మకం ఈ సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. దర్శకుడు శైలేష్‌ కొలను మూడో సినిమాతో ఎలాంటి ప్రభావం చూపించాడు. క్రూరత్వం నింపుకొన్న అర్జున్‌ సర్కార్‌ అనే పోలీస్‌ పాత్రలో నాని నటన ఎలా ఉందన్నదే సినిమా కథ. అర్జున్‌ సర్కార్‌ (నాని) ఐపీఎస్‌ అధికారి. జమ్మూకశ్మీర్‌లోని హోమిసైడ్‌ ఇన్వెస్టిగేటివ్‌ టీమ్‌ (హిట్‌)లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనుక ఓ పెద్ద నెట్‌వర్క్‌ ఉందని అర్జున్‌ తెలుసుకుంటాడు.…