అముద శ్రీనివాస్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై పోత్నాక్ శ్రవణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2 విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర బృందం తో పాటు టీఎఫ్పీసీ సెక్రటరి ప్రసన్న కుమార్ , రామకృష్ణ గౌడ్, శోభారాణి పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘నా.. నీ ప్రేమ కథ’ ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా వున్నాయి. సినిమా చాలా బావొచ్చింది. టీం చాలా కస్టపడి ఈ…