మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ లో తమన్నా భాటియా కథానాయికగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ల క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్’ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు తమన్నా. ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్న భోళా శంకర్ ఆగస్ట్ 11న, జైలర్ ఆగస్ట్10న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ రెండు చిత్రాలలో నటించిన హీరోయిన్ తమన్నా మీడియాతో మాట్లాడుతూ… సినిమాల విశేషాలని పంచుకున్నారు. ఒక రోజు గ్యాప్ లో మీరు నటించిన భోళా శంకర్, జైలర్ సినిమాలు విడుదలౌతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ? – చాలా ఆనందంగా వుంది. రెండు సినిమాలు అన్నీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్…