మెగా ప్రొడ్యూసర్ కె.టి కుంజుమోన్ ‘జెంటిల్‌మన్ 2’ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి

Mega producer KT Kunjumon's 'Gentleman 2' first schedule shooting is complete

మెగా ప్రొడ్యూసర్ కె.టి.కుంజుమోన్‌ జెంటిల్‌మన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై “జెంటిల్‌మన్-2” చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చేతన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార చక్రవర్తి, ప్రియాలాల్ కథానాయికలు. చెన్నై పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. 15 రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో చేతన్, నయనతార చక్రవర్తి, ప్రియా లాల్, బాడవ గోపి, సుధా రాణి, సితార, శ్రీ లత, కన్మణి, లొల్లు సభ స్వామినాథన్, బేబీ పద్మ రాగం , ముల్లై-కోతాండమ్‌లు పాల్గొన్నారు. స్టంట్ కొరియోగ్రఫర్ దినేష్ కాసి సూపర్ విజన్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించారు. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ మేజర్ హైలెట్ ఉండబోతుంది. తదుపరి షెడ్యూల్ నవంబర్…