ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు!! చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (“సి.హెచ్.ఆర్”)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన “నేను-కీర్తన” ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి “మనసయ్యింది” లిరికల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అంచుల నాగేశ్వరరావు – సి.హెచ్.ఆర్ రాసిన ఈ గీతానికి హరి గుంట – లాస్యప్రియ గాత్రం అందించారు. ఎం. ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీతం సారధి. ఈ గీతాన్ని “రమేష్ బాబు – మేఘన”లపై కులుమనాలిలో చిత్రీకరించారు!! ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ… నేను – కీర్తన” చిత్రానికి పాటలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. మా…