మిస్టర్ అండ్ మిస్ సినిమాతో రొమాంటిక్ హిట్ ఫిల్మ్ రూపొందించిన దర్శకుడు అశోక్ కుమార్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా మహానటులు. ఏబీఆర్ ప్రొడక్షన్స్ అండ్ ఏబీఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అభినవ్ మణికంఠ, గోల్డీ నిస్సీ, మ్యాడీ వీజే, పవన్ రమేష్, భరత్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ బొడ్డిరెడ్డి, డాక్టర్ తిరుపతి ఆర్ యర్రంరెడ్డి నిర్మాతలు. మహానటులు పోస్టర్ లాంఛ్, క్యారెక్టర్ రివీల్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, బిగ్ బాస్ విజేత సన్నీ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ…అశోక్ నేనూ మహేష్ కత్తి, సుధీర్ వర్మ రెగ్యులర్ గా కలిసేవాళ్లం. అశోక్ ఏ…