# దర్శకుడిగా హరనాథ్ రెడ్డికి నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు- ఎంఎస్.రెడ్డిలకు ఉజ్వల భవిష్యత్తు!! # ఈనెల 18న బ్రహ్మాండమైన విడుదల!! శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం “మాతృదేవోభవ”. ‘ఓ అమ్మ కథ’ అన్నది ఉప శీర్షిక. వెయ్యి సినిమాలకు పైగా నటించిన సీనియర్ నటీమణి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మాతృదేవోభవ” ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర…