వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “ముఖచిత్రం”. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన అనుభవాలు తెలిపారు హీరోయిన్స్ ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్. హీరోయిన్ ప్రియా వడ్లమాని మాట్లాడుతూ…నేను ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో రెండు విభిన్న…