పైగంబర కవితోద్యమ నాయకుడు, జర్నలిస్ట్ ఎమ్.కె.సుగమ్ బాబు వెళ్ళిపోయారు!

m k sugambabu no more

సత్యానికి, ప్రేమకు అంకితమైన ‘రెక్కల’ కవి, పైగంబరుడు ఎం.కె సుగమ్ బాబు (మహాబూబ్ ఖాన్) మంగళవారం 18-10-2022న తెల్లవారు జామున తుది శ్వాస నిలిచిపోయింది. అయన గత రెండుళ్లుగా అస్వస్థులుగా మంచంలో ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ‘సూరీడు’ పాటలతో కవిగా అయన ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత ‘రెక్కలు’ ప్రక్రియను సాహితీలోకానికి పరిచయం చేసి ‘రెక్కలు’ కవిగా సుప్రసిద్దులయ్యారు. ప్రముఖ కవి, పైగంబర కవితోద్యమ నాయకుడు ఎమ్.కె. సుగమ్ బాబు వెళ్ళిపోయారన్న విషయాన్ని ఆయనతో పనిచేసిన ఆంధ్రభూమి సహచర పాత్రికేయులు గుర్తు చేసుకొని ఆయన పవిత్ర ఆత్మకు శ్రద్థాంజలి ఘటించారు. హైదరాబాదునుండి ఆయన పార్థివ దేహాన్నిమంగళవారం గుంటూరు కొరిటెపాడు లైబ్రరీ వీధి వినాయకుడి గుడి, కార్ ట్రావెల్ దగ్గర వున్న వారి అబ్బాయి స్వగృహానికి తరలించారు. తెలుగు సాహిత్య రంగంలో విన్నూతమైన కవిగా ‘రెక్కలు’ ఆవిష్కర్తగా ప్రభావవంతమైన…