క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో ఆకట్టుకున్న దర్శకుడు కె దశరథ్ అందిస్తున్న కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ యూ రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ , థీమ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ లాంచ్ చేశారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సాంగ్ టీజర్ ని విడుదల చేశారు. లీడ్ పెయిర్, వారి భిన్నమైన పాత్రలను పరిచయం చేయడం ద్వారా సినిమా బేసిక్ ప్లాట్ లైన్ ని ఆసక్తికంరగా రివిల్ చేశారు. లీడ్ పెయిర్ చిన్నప్పటి నుండి…