అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ‘క్షీరసాగరమథనం’లోని ‘నీ పేరు పిలవడం… నీ పేరు పలకడం’ గీతాన్ని సంచలన దర్శకులు హరీష్ శంకర్ ట్విట్టర్లో విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అజయ్ అరసాడ స్వర కల్పనలో.. శ్రీమణి రాసిన ఈ పాటను ‘రాములో రాముల’ ఫేమ్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రం పోస్ట్…