విజయవాడలో నేరస్థులకు సింహ స్వప్నంగా ఉండే ఐపీఎస్ ఆఫీసర్ మీసాల రాజు అలియాస్ సీతారామరాజు విశాఖ పట్నం సిటీకి ట్రాన్స్‌ఫర్స్ అయ్యారు అనే డైలాగ్‌తో కొరమీను ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ డైలాగ్ వచ్చే సమయంలోనే మీసాల రాజుగా యాక్టర్ శత్రు ఇంట్రడక్షన్ ఇచ్చారు. విశాఖకు వచ్చిన మీసాల రాజుకి మీసాలుండవు. అదే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హాట్ టాపిక్ అవుతుంది. సీతారామరాజుకి అది పెద్ద సమస్యగా మారుతుంది. మరో వైపు విశాఖ నగరంలోని జాలరి పేటలో డ్రగ్స్‌కి సంబంధించిన గొడవ జరుగుతుంటుంది. ఆ కేసుని మీసాల రాజు టేకప్ చేస్తాడు. మరో వైపు జాలరి పేటలో ఉండే డాన్ కరుణ ఆ ప్రాంతాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉంటాడు. ఈ పాత్రలో హరీష్ ఉత్తమన్ కనిపించారు. అలాంటి కరుణాకి రైట్ హ్యాండ్ కోటి. పాత్రను మన కథానాయకుడు…