ఇఫీలో ఇండియన్ పనోరమాకు ‘స్రవంతి’ రవికిశోర్ తొలి తమిళ సినిమా ‘కిడ’ ఎంపిక

kida in indian panoram iffi

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI)లో ఇండియన్ పనోరమాకు ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్‌ను ఇటీవల వెల్లడించారు. ఫీచర్ ఫిల్మ్స్‌లో సుప్రసిద్ధ తెలుగు నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తమిళ సినిమా ‘కిడ’ ఒకటి. ‘కిడ’లో పూ రామన్, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఓ తాత, మనవడు, మేక పిల్ల చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. తమ సినిమాకు అరుదైన గౌరవం లభించడంతో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”ఆర్ఏ వెంకట్ ఈ ‘కిడ’ కథను చెప్పినప్పుడు ఇందులో విషయం ఉందని అర్థమైంది. అందరికీ కనెక్ట్ అవుతుందని వెంటనే ఓకే చేశా. ఇది…