మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ రమేష్ వర్మ రూపొందించే యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖిలాడి’ నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో హవీష్ క్లాప్ కొట్టగా, ఐ. శ్రీనివాసరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఆదివారం ఉదయమే విడుదల చేసిన ‘ఖిలాడి’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అన్నివైపుల నుంచీ అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. టోటల్ బ్లాక్ డ్రస్‌లో తనదైన స్టైల్ డాన్స్ మూవ్‌తో ఈ పోస్టర్‌లో రవితేజ ఆకట్టుకుంటున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హవీష్ ప్రొడక్షన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘ఖిలాడి’ మూవీకి డాక్టర్ జయంతీలాల్ గడ (పెన్) సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. రవితేజ సరసన…