వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘జపాన్’ చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన జపాన్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ టీజర్ ని మేకర్స్ ఈ రోజు విడుదల చేశారు. హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒకడు కన్నమేసి రెండు వందల కోట్ల విలువల చేసే నగలు ఎత్తుకుపొతే మీ లా అండ్ ఓర్ద్ ఏం చేస్తుంది ? ఈ దొంగతనం స్టయిల్ చూస్తే జపాన్ ది లానే అనిపిస్తుంది ఇండియా అంతటా జపాన్ పై 182 కేసులు వున్నాయి. నాలుగు రాష్ట్రాల…