చిన్న సినిమాగా విడుదలై పెను సంచలనం సృష్టించింది ‘కాంతార’. కన్నడ నుంచి నుంచి వచ్చిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లను కలెక్ట్ చేసింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో కూడా సంచలనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఓటీటీలో సినిమా చూసిన వారందరూ సినిమాపై పెదవి విరుస్తున్నారు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లైమాక్స్‌లో వచ్చే ‘వరాహరూపం’ పాటనే ‘కాంతార’ సినిమాకు ఊపిరి. కానీ, ఈ పాట లేకుండా వేరే ట్యూన్‌తో ఓటీటీలో సినిమాను విడుదల చేశారు. దీంతో సినిమా చూసిన వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు…