వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలివి వనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది. కలివి వనం సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర టీజర్ ను గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు.. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ,జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. వైస్ ప్రెసిడెంట్ వై. జె రాంబాబు , గద్దర్…