టాలీవుడ్, బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత సత్యభామ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. అయితే ఈ భామ తాజాగా మరో బంఫరాఫర్ కొట్టినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లోకాజల్ ఛాన్స్ కొట్టేసినట్లు- తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కాజల్ రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్నారు. నితీష్ తివారి ’రామాయణ’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నటీనటుల ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఖరారయ్యారు. ఇప్పుడు మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు…