‘బోగ‌న్’ తొలి గీతం ‘సింధూర’‌ విడుద‌ల‌

bogan movie first single sindhura out now

జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్‌తో తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన ‘బోగ‌న్’ చిత్రాన్ని అదే పేరుతో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన‌ బోగ‌న్ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్ కు అనూహ్య స్పంద‌న ల‌భించిన నేప‌థ్యంలో ఈ చిత్రం ఆడియో నుంచి సింధూర అనే పాటను విడుద‌ల చేశారు యూనిట్ స‌భ్యులు. త‌మిళ సెన్సేష‌న్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమామ్ ట్యూన్ చేసిన ఈ పాట‌ను తెలుగులో స‌మీర భ‌ర‌ధ్వాజ్ ఆల‌పించారు. అలానే భువ‌న‌చంద్ర ఈ పాట‌కు లిరిక్స్ అందించారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ మా బ్యాన‌ర్ నుంచి బోగ‌న్ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చినప్ప‌టి నుంచి అటు ప్రేక్ష‌కుల నుంచి ఇటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల…