స్వప్న సినిమాస్ అప్ కమింగ్ మూవీ ‘ఛాంపియన్’ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం సినిమా విశేషాలు పంచుకున్నారు. ఛాంపియన్ కథ గురించి ? -బైరాన్‌పల్లి సంఘటనని కొంచెం ఆధారంగా చేసుకొని ఫిక్షన్ గా చేసిన కథ ఇది. బైరాన్‌పల్లి, మైఖేల్ రెండు వేర్వేరు కథలు. బైరాన్‌పల్లి గురించి తీస్తే అది డాక్యుమెంటరీ తరహలో వచ్చే అవకాశం వుంది. ఇప్పుడు జనరేషన్ ఆడియన్స్…
