ఈ సంవత్సరం పలు సినిమాలపై ఆసక్తి!

Interested in many movies this year!

రానున్న నెలల్లో తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూసే సినిమాలు చాలానే వున్నాయి. రామ్‌ పోతినేని, పూరి జగన్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, ఎన్టీఆర్‌, కొరటాల శివ చేతులు కలిపిన ‘దేవర’ పార్టు వన్‌, అల్లు అర్జున్‌ తో దర్శకుడు సుకుమార్‌ చేస్తున్న ‘పుష్ప 2’ ఇంకా ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడి’. ఇందులో కొంచెం బడ్జెట్‌ ఎక్కువ వున్న సినిమాలు వున్నాయి, సీక్వెల్స్‌ వున్నాయి. పైన చెప్పిన సినిమాలు అన్నీ విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించారు, ఇంకా రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌ లో వస్తున్న ‘గేమ్‌ చెంజర్‌’ విడుదల తేదీ ప్రకటించలేదు కానీ.. ఆ సినిమా కూడా ఈ సంవత్సరమే విడుదలవుతుంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్నీ విడుదల తేదీలు ప్రకటించినా ఈ సినిమాలన్నీ వాయిదా…