-రామ్ కి కళామతల్లి ఆశీర్వాదంతో పాటు కుటుంబసభ్యుల ఆశీస్సులూ ఉంటాయి: శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి – మా దైవం ఎన్టీఆర్ గారి ఘాట్ నాకు పుణ్యక్షేత్రంతో సమానం. ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి: డైరెక్టర్ వైవిఎస్ చౌదరి -నందమూరి తారక రామారావు, డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి, యలమంచిలి గీత, న్యూ టాలెంట్ రోర్స్ @ ప్రొడక్షన్ నెం1 ఎన్టీఆర్ ఘాట్ లో గ్రాండ్ గా లాంచ్ తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్…